బాలకాండ సర్గ 5 అయోధ్య నగర వర్ణన balakanda sarga 5
సప్తద్వీపములతో కూడిన ఈ సమస్త భూమండలమును మన ప్రజాపతి మొదలుకొని ఎంతోమంది రాజులు పరిపాలించారు సరయునది తీరాన కోసల అని రాజ్యం కలదు కోసల రాజ్యంలో అయోధ్య అను పేరు గల ఒక మహానగరం గలదు అయోధ్యను మనవు నిర్మించెను 12 యోజనాల పొడవు మూడు యోజనాల వెడల్పు కలిగి ఉన్నది వనములు నదులతో అందంగా ఉంది
ఈ నగరమునందు ద్వారములు ద్వారబంధములు నగర మధ్యమున అంగళ్లు వివిధ యంత్రాలు ఆయుధములు అమర్చబడి ఉండెను నిపుణులైన శిల్పులు సుత్తి పాఠకులు బంది మాగదులు కలరు ఆ నగరం ఎత్తైన కోట బురుజులతోనూ ధ్వజములతోనూ వందలకొత్తి శతజ్ఞులతోనూ ఆ నగరం ఉన్నది అయోధ్య నగర వీరులు శబ్ద బేదీ విద్యలు ఆరితేరిన వారు వారు ఆ విద్యను అరణ్యములో ప్రమాదకరముగా ఉన్న సింహాలను హతమార్చుటకు ఉపయోగించేవారు.
Comments
Post a Comment