బాలకాండ 4 కుశలవులు రామాయణమును గానము చేయుట Balakanda sarga 4
వాల్మీకి మహర్షి రామాయణమును నాలుగు ఖండాలుగా విభజిస్తారు. ఉత్తరకాండతో సహా సంపూర్ణముగా రచించి ఈ శ్రీరామ కథా గానము ఎవరు చేయగలరు అని ఆలోచిస్తుండగా కుశలవులు అక్కడికి వస్తారు.
వారిని చూసిన వాల్మీకి రామాయణము గానము చేయుటకు వీరు సమర్థులు అని తలచెను. రామాయణమును సీతావృత్తాంతము లేదా పౌలస్యవధ అని సంబోధిస్తారు అని వాల్మీకి కుశలవులకు చెప్పెను.
రామాయణము చక్కగా పఠించుటకు మధురముగా గానము చేయుటకు అనువైనది. తిస్రా చతురస్ర మిశ్ర ప్రమాణములతో అలరారునది. సా రి గ మ ప ద ని అను సప్త స్వరములతో కూర్చబడినది. వీణాది తంత్రీవాజముల పైనను మృదంగాది లయ వాద్యములతోడును పలికించుటకు అనువైనది. శృంగార వీర కరుణ హాస్య రౌద్ర భయానకాది నవరసములతో పరిపుష్టమైనది. అట్టి రామాయణ కావ్యం ఆ లవకుశులు గానం చేసిరి. లవకుశులు సంగీత శాస్త్రమున ఆరితేరిన వారు వీణ గానము కమ్మని కంఠము గలవారు రాముని పోలికలు గలవారు ఇలా గానము చేయుచున్న లవకుశు లకు మునులలో ఒకరు కలశమును బహుకరించెను మరొక మహర్షి వల్కలము, జింక చర్మము మౌంజి కమండలము యజ్ఞోపవీతము మేడిపీఠము దానిపై ఆసనము జపమాల కౌపీనము గొడ్డలి కాషాయ వస్త్రము ఉత్తరీయము జటాబంధనము. కాష్ఠ రజ్జువు. యజ్ఞ పాత్ర సమిధలను బహుకరించారు.
లవ కుశ రామాయణ కథా గానము గూర్చి విని శ్రీరాముడు లవ కుశులను పిలిపించి రామకథ గానము విని ఆనందించెను. ఆ సమయమున శ్రీరాముడు అశ్వమేధ యాగము చేయుచున్నాడు.
Comments
Post a Comment